Wednesday 9 August 2017

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

తెల్లదొరలను గజ గడలాడించిన రేనాటి వీరుడు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
"అదుగో వచ్చే, ఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి
..............................
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికినడూ
.......................................
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
నాలుగు గ్రామాల మందిగా తాము లేచినారు."
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ళముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటుజెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
విజయనగర రాజులు తళ్ళికోట యుద్ధంలో బహమని సుల్తానుల చేతిలో ఓడిపోయారు. సామంతులుగా వుండిన పాలెగాళ్ళు తమ కత్తికి అడ్డం లేకుండా నియంతల వలె వ్యవహరింపసాగారు. రాజులమని గొప్పగా విర్రవీగేవారు.
1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పుడు రాయలసీమ నైజాం వశంలో ఉండేది. నైజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. పాలెగాళ్ళు బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చారు. కడపజిల్లాలో ఆనాడు 80మంది పాలెగాళ్ళుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. దత్తమండలానికి మొట్టమొదటి కలెక్టర్ సర్ ధామస్ మన్రో. పాలెగాళ్ళ పారంపర్య హక్కులను రద్దుచేసాడు. వారికి నెలసరి ఫించన్ ఏర్పాటు చేశాడు.
ఈనాటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పాళెగాడు పెద్దమల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. కోయిలకుంట్ల తాలూకా లోని ఉయ్యాలవాడ జాగీర్‌ను ఆంగ్లేయులు వశం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుండి 30 వేల రూపాయలకు పైగా రెవిన్యూ రాబడి వుండేది. జాగీర్‌ను వశం చేసుకున్న తెల్లదొరలు పెద్దమల్లారెడ్డి కుటుంబానికి రు. 70 ఫించన్ ఏర్పాటు చేశారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుదా 11 రూపాయలు 10 అణాలు 8 పైసలు ఫించన్ వచ్చేది. నరసింహారెడ్డి మాతామహుడైన (తల్లి తండ్రి) నొస్సం జమీందార్ జయరామరెడ్డికి ఏటా 22 వేల రూపాయల రెవిన్యూ వచ్చే జాగీర్‌ను వశం చేసుకుని నెలకు వేయి రూపాయల ఫించన్ ఏర్పాటు చేశారు. నొస్సం జమీందార్ నిస్సంతుగా మరణించడంతో ఫించన్ మొత్తం ఆపివేయబడింది.
తెల్లదొరలు క్రమంగా కట్టుబడి మాన్యాల వంశ పారంపర్య హక్కును రద్దు చేసి మాన్యాలను స్వాధీనం చేసుకోవడంతో కట్టుబడి బంట్రోతుల్లో అసంతృప్తి చెలరేగింది.
1846 జూన్ నెలలో తనకు రావలసిన మేనెల ఫించన్ పైకం కోసం, చీటి వ్రాసి కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపాడు నరసింహారెడ్డి. అదివరకు, పైకం పంపుతున్న తాసిల్దార్ ఈసారి వచ్చిన మనిషిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేకాని ఫించన్ పైకం యివ్వనన్నాడు. రెడ్డి ఉదాసీనంగా వుండటం గమనించిన తహసీల్దారు వారంట్ యిచ్చి బంట్రోతులను పంపాడు. వచ్చిన వాళ్ళను తన్ని తరిమేశాడు నరసింహారెడ్డి. ఈ విధంగా పోరాటం ఆరంభమైందంటారు.
మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లు కొండజాతుల వాళ్ళు నరసింహారెడ్డిని ఆశ్రయించారు. నరసింహారెడ్డి నాయకత్వంలో దాదాపు 9 వేల మంది చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు జమీందార్లు పెనుగొండ, ఔకు, జమీందార్లు, హైదరాబాద్‌కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్, కొందరు బోయలు, చెంచులు, బ్రాహ్మణులు కూడా నరసింహారెడ్డి సైన్యంలో చేరారు. కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిపై నిఘా పెట్టింది.
1846 జూలైలో (7, 8 తేదీలు కావచ్చు) నరసింహారెడ్డి 9 వేల మంది అనుచరులతో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రామంపై దాడి చేశాడు. మిట్టపల్లి వద్ద పోలీసులు వారిని అటకాయించారు. ఈ పోరాటంలో ఒక దఫేదారు తొమ్మిదిమంది బంట్రోతులు మరణించారు.
నరసింహారెడ్డి బృందం మరుసటి దినం కోయిలకుంట్ల ట్రెజరి పైబడి ఆనాడు ఖజానాలో వున్న, ఎనిమిది వందల అయుదు రూపాయల పది అణాల నాలుగు పైసల మొత్తాన్ని దోచుకున్నారు. తహసీల్దారు రాఘవాచారిని నరసింహారెడ్డి మనుషులు బందీగా పట్టుకున్నారు. ఖజానా సిబ్బందిని అయిదుగురిని చంపివేశారు. నరసింహారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులకు సహాయంగా సైన్యాన్ని పిలిపించమని కలెక్టర్ కడపలోని కమాండింగ్ ఆఫీసరును కోరాడు. కర్నూలు నుండి గుర్రపు దళాన్ని పిలిపించారు. నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను, చుట్టుపట్ల గ్రామాలను దోచుకున్నాడు. అప్పటికే సైన్యం జమ్మలమడుగు చేరుకున్నది. నరసింహారెడ్డి తన బృందంతో అహోబిలం కోట చేరుకున్నాడు. నరసింహారెడ్డి ఆచూకీ తీయడం ప్రభుత్వానికి కష్టమైంది. కంభం తహసీల్దారును వెంటపెట్టుకుని కడప నుండి కెప్టెన్ నాట్ పెద్ద సైన్యంతో బయలుదేరాడు. జె. ఎచ్. కొక్రీన్ మరో సైనిక దళంతో రుద్రవరం వద్ద, నాట్‌ను కలుసుకునే ఏర్పాటు చేశాడు. తిరుగుబాటు దళం గుత్తి కనుమ మీదుగా ముండ్లపాటు చేరుకుంది. అక్కడికి మూడుమైళ్ళ దూరంలోని కొత్తకోటలోని పాడుపడిన కోట, నరసింహారెడ్డికి కార్యాలయం అయింది. నరసింహారెడ్డి ప్రతి కనుమ దగ్గర కొంత కట్టుబడి సిబ్బందిని కాపలా వుంచాడు.
నరసింహారెడ్డి 5 వేల బలగంతో పాట్సన్‌ను గిద్దలూరు వద్ద అడ్డుకున్నాడు. పాట్సన్ వద్ద సైనికులు వందమందే. ఆరు గంటలసేపు నరసింహారెడ్డి మనుషులకు, పాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరిగింది. నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణించారు. చీకటి పడటతో యిరుపక్షాల వారు తమదారిన తాము వెళ్ళిపోయారు.
కొండలలోని కాలిబాటలు అడ్డదారులు సైనికులకు పరిచయం లేవు. నరసింహారెడ్డి మనుషుల కోసం సైన్యం కొండలన్నీ గాలించింది. గ్రామాధికార్ల మీద, కట్టుబడిదార్ల మీద కేసులు మోపారు.
నరసింహారెడ్డి పాలెగాణ్ణి పట్టిస్తే వేయి రూపాయలు, అతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వ ప్రకటించింది.
నరసింహారెడ్డి తన కుటుంబాన్ని కొత్త కోటకు తరలించాడు. ప్రభుత్వ సైనికులు ఆ ప్రాంతంపై దాడి జరిపినపుడు హైదరాబాద్ రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాల్‌ఖాన్‌కు, నరసింహారెడ్డి మధ్య జరిగిన ఉత్తరప్రత్యత్తరాలను పట్టుకున్నారు. ఆ పత్రాలు విచారణలో ప్రభుత్వానికి బలమైన సాక్ష్యాలయ్యాయి.
నరసింహారెడ్డికి ముగ్గురు భార్యల ద్వారా ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్ళూ ఉండేవారు. నరసింహారెడ్జి కుటుంబాన్ని పట్టుకుని ప్రభుత్వం, వారిని కడపలోని ఒక బంగళాలో వుంచారు. మెరుపుదాడి చేసి కుటుంబ సభ్యులను విడిపించాలని కొండలమీదుగా ప్రయాణం చేసి కడప చేరాడు నరసింహారెడ్డి.
1846 అక్టోబర్ 6వ తేదీన ఎర్రమల నలమల కొండల మధ్యనున్న పేరసామల లోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 40, 50 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపారు. వందమంది దాకా గాయపడ్డారు. కాలికి గుండు దెబ్బ తగలడంతో రెడ్డి ఫిరంగి దళాలకు పట్టుబడినాడు.
నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు. అది మామూలు శిక్ష కాదు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా తీర్పు.
1827 ఫిబ్రవరి 22 న ఫలానాచోట ఉదయం 7 గంటలకు నరసింహారెడ్డిని ఉరి తీస్తారని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. కాక్రేన్ ఎదుట ఉరి తీశారు.
ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీళ్ళు రాలుస్తూ చూచారు. వారికి నోళ్ళకు బీగాలు పడ్డాయి. నరసింహారెడ్డి ప్రాణం ఉరికంబం మీద అనంతవాయువుల్లో కలిసేవరకు అతని ముఖం ప్రశాంత గంభీరంగా వుండినది.
చుట్టుప్రక్కల వారికి హెచ్చరికగా వుండాలంటూ నరసింహారెడ్డి శిరస్సును రెండు మూడు తరాల వరకు ఆ బురుజుపై వేలాడేటట్లు చేశారు ఆనాటి కిరాతకులైన తెల్లదొరలు. నరసింహారెడ్డి వంటి త్యాగమూర్తుల బలిదాన ఫలం యీనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం.
జానపదులు ఆ స్వాతంత్ర్య వీరుని అమరగాధను పాడుతూ మనలను ఉత్తేజపరుస్తున్నారీనాటికీ.
"దొరవారి నరసింహారెడ్డి
నీ దొర తనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి
రేనాటిసీమలో రెడ్డోళ్ళ కులములోనా
దొరవారి వమిశానా ధీరుడే నరసింహారెడ్డి
కోయిల కుంట్లా గుట్టలెంటా కుందేరు వొడ్డులెంటా
గుర్రమెక్కి నీవు వస్తే కుంపిణికి గుండెదిగులూ
కాలికి సంకెళ్ళు వేసి చేతికి బేడీలు వేసి
పారాతో పట్టి తెచ్చి బంధికానులో పెట్టిరీ
కండ్లకు గంతలూ గట్టి నోటి నిండా బట్లు పెట్టి
నిలువునా నీ తల్లికేమో చావు సుద్దీ తెలిపినాదీ
కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే
దొరవారి నరసింహారెడ్డి
నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి"

Tuesday 1 August 2017

UYYALAWADA NARASIMHA REDDY STORY ON ABN PAPER


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర


  • స్వాతంత్య్ర పోరాటం తొలి గర్జన ‘ఉయ్యాలవాడ’
  • బ్రిటీషు సైన్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడు
  • సిపాయిల తిరుగుబాటుకు ముందే తిరుగుబావుటా
  • తరతరాలకూ స్ఫూర్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర
ఆసేతు హిమాచలం తెల్లదొరల పాలనలో మగ్గుతున్న వేళ.. సీమ పౌరుషం భగ్గుమంది. భరతమాతను చెర విడిపించేందుకు ‘ఆరడుగుల’ సీమ సింహం జూలు విదిల్చింది. పదునైన ఖడ్గం చేతబట్టి శత్రువుల తలలను తెగనరికింది. రవి అస్తమించని సామ్రాజ్యపు వెన్నులో వణుకు పుట్టించింది. ఇది చరిత్ర అంతగా ఎరుగని తొలి స్వాతంత్య్ర సంగ్రామం.
అయితేనేం.. ఇప్పటికీ.. సీమ పల్లెల్లో.. మెలితిరిగిన ప్రతి మీసం.. కుంచెగా మారి.. ఆ వీరుడి కీర్తిని రచిస్తూనే ఉంది. సేద్యపు పనుల్లో, సేదదీరిన వేళల్లో.. ‘సై సైరా.. నరసింహారెడ్డి..’ అని ప్రతి గుండె ఉప్పొంగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఈ పేరు చెప్పగానే సీమలోని ప్రతి కుడిచేయీ తొలుత మీసంపైకి.. తదుపరి తొడపైకి వాయు వేగంతో పయనిస్తుంది. ఈ వీరుడి చరిత్రను మెగాస్టార్‌ చిరంజీవి కథనాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరపైకి ఎక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నరసింహారెడ్డి గురించి ఈవారం ప్రత్యేకం..
‘సైసైరా నరసింహారెడ్డి... రెడ్డీ... నీ పేరే బంగారపు కడ్డీ...’ అంటూ జానపద శైలితో, ప్రజానోళ్లలో జాలువారే ఇలాంటి పాటలెన్నో ఆయన వీరత్వానికి ప్రతీకగా నిలు స్తాయి. బ్రిటీషువారి దాష్టీకాన్ని ప్రశ్నించి, వారిపై సాగిం చిన మడమ తిప్పని పోరాట పటిమను కళ్లముందు సాక్షాత్కరింపజేస్తాయి. కుంఫిణీ (ఈస్టిండియా కంపెనీ) వారి కుటిల కుతంత్రాలపై కన్నెర్రజేసి కత్తిదూసి కదన రంగంలోకి దూకిన తొలితరం యోధుని రూపాన్ని ఆవి ష్కరిస్తాయి. వెయ్యి ఏనుగులనైనా నిలువరించే బ్రిటీషు సైన్యానికి... ఆ ఒక్కపేరు చెబితేనే సింహ స్వప్నం. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే తిరుగుబాటు చేసిన ఈ యోధుని పేరు చరిత్రలో అంతగా కనిపించదు. అయితేనేం.. రేనాటి సీమలో ఏ ఇంట అడిగినా ఆయన వీరత్వాన్ని వివరిస్తారు. రాలసీమ పౌరుష పతాకంపై చెరగని గుర్తు.. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. ఉరికొయ్య ఎక్కేముందుకూడా తొడగొట్టి మీసం మెలేసి, పరాక్రమాన్ని వీలునామాగా రాసిపోవెళ్లిన ధీరుడు.
రేనాటి చరిత్ర...
బ్రిటీషువారు దక్షిణ భారతదేశంలో కాలుమోపిన 1750 ప్రాంతంలో ఇక్కడ బలమైన పాలకులు ఒకరు నిజాం నవాబు, మరొకరు మైసూర్‌ పాలకుడు హైదర్‌ ఆలి. హైదర్‌ ఆలిని ఓడిస్తే దక్షిణాన పాగా వేయవచ్చని బ్రిటీషువారు యుద్ధం చేశారు. హైదర్‌ ఆలి కుమారుడు టిప్పుసుల్తాన్‌ ఆంగ్లేయులను పలుమార్లు ఓడించి తరిమే శాడు. చివరికి మరాఠా పీష్వా, నిజాం నవాబు సహ కారంతో నాల్గవ మైసూర్‌ యుద్ధం (1799)లో టిప్పు సుల్తాన్‌ సైన్యాన్ని బ్రిటీష్‌వారు ఓడించారు. టిప్పును చంపి రాజ్యాన్ని ముగ్గురూ పంచుకున్నారు. కర్ణాటకలోని కొంతప్రాంతం మరాఠా పీష్వాలకు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కాయి. మద్రాసు కేంద్రంగా దక్షిణాదిన బ్రిటీష్‌ పాలన ఆరంభమైంది. నిజాం నవాబు ఏలుబడిలోకి వచ్చిన కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి ప్రాంతాల్లో పాలెగాండ్లు స్థానిక పాలకులు. ఒక్క పాలెగాని కింద వంద నుంచి రెండు వందల గ్రామాలు ఉండేవి. ఈ వ్యవస్థను బలోపేతం చేసిన వారు విజయనగర రాజులు. పాలెగాండ్లు వారి సామంతులు.

నొస్సం పాలెగాండ్ల చరిత్ర..
కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లా లోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలేగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరు జయరామిరెడ్డి. విజయనగర రాజుల కాలం నుంచి పాలన సాగిస్తున్న ఈయన మన్రో హయాంలో బ్రిటీషువారిని ఎదురించి బంధీ అయ్యాడు. నొస్సం బ్రిటీషువారి వశమైంది. ఆయనకు భరణం ఏర్పా టు చేశారు. జయరామిరెడ్డి కొడుకుకు సంతానం లేకపో వడంతో, అతని సోదరి కుమారుడు ఉయ్యాలవాడ నర సింహారెడ్డికి భరణం అందేది. ఆయన జన్మించింది రూప నగుడిలో. పెరిగింది ఉయ్యాలవాడలో. భరణం అందు కుంటూ ఉంటున్నది నొస్సం కోటలో. పాలించే అధికారం లేకపోయినా జయరామిరెడ్డి వంశీయుల ప్రభావం ఆ ప్రాంతంలో ఏమాత్రం తగ్గలేదు. ప్రజలు వారి కుటుం బాన్ని గౌరవభావంతో, ఆదరాభిమానాలతో చూసేవారు. అప్పటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వయసు సుమా రు నలభై ఏళ్లు. ఆయనకు బ్రిటీషు వారి నుంచి నెలకు రూ.11 భరణం అందేది.

ఆత్మాభిమానానికి ప్రతీక నరసింహారెడ్డి..
వంశానుసారంగా అందాల్సిన భరణం విషయంలో జరిగిన ఓ చిన్న సంఘటన నరసింహారెడ్డిలోని ఆత్మాభి మానాన్ని దెబ్బతీసింది. తన ప్రాంతంపై పెత్తనం చెలా యిస్తూ, దేశాన్ని కొల్లగొడుతున్న బ్రిటీషు వారిపట్ల ఆయ నకు అప్పటికే ఉన్న కోపం, కసి, పగ, ద్వేషం తారా స్థాయికి చేర్చింది. నాటి కోవెలకుంట్ల తహసీల్దారు రాఘవాచారి నరసింహారెడ్డికి చెల్లించాల్సిన భరణం విషయంలో అవహేళనగా మాట్లాడి ఆయనలో కోపావేశాలు పెరిగేలా చేశాడు. నరసింహారెడ్డి పంపిన అనుచరుడితో ‘ముష్టి తీసుకునే వాడికి మరోక ముష్టివాడా..? అతను బ్రిటీషు వారి నుంచి భరణం తీసుకుంటూ బ్రిటీషు వారికి శిస్తు కట్టొద్దని చెబుతున్నాడట. ఆ ముష్టివాడినే రమ్మను.. ఇస్తా భరణం’ అని చెప్పి పంపడంతో నర సింహారెడ్డిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఏకంగా ‘ట్రెజరీనే కొల్లగొల్లడతాను. నీ ప్రాణాలు తీస్తాను. చేతనైతే రక్షించుకో..’ అంటూ లేఖరాసి పంపిం చాడు. దీంతో తహసీల్దారు అప్రమత్తమై, ట్రెజరీలోనే ఉండిపోయాడు.
రక్షణగా కొంత బ్రిటీషు సైన్యాన్ని ఏర్పా టు చేసుకున్నా... నరసింహారెడ్డి చెప్పిన మాట ప్రకారం 1846 జూలై 10న మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన అనుచరులతో దాడి చేశాడు. రెడ్డి అనుచరుల కత్తులు స్వైర విహారం చేశాయి. ఎదురొచ్చిన మిలిటరీ సైన్యాన్ని మట్టుబెట్టి, తనను అవహేళనగా మాట్లాడిన తహసీల్దారు రాఘవాచారి శిరస్సు ఖండించాడు నరసింహారెడ్డి. ట్రెజరీ అధికారి థామస్‌ ఎడ్వర్టుకి గుండుగీయించి, ‘నీ బ్రిటీషు అధికారు లకు దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నయనా లప్ప వద్ద కలుసుకోమను’ అని చెప్పి, ఎనిమిది వందల అయిదు రూపాయల పది అణాల నాలుగు పైసలను కొల్లగొట్టుకెళ్లి బ్రిటీషు సైన్యానికి సవాలు విసిరాడు.
నొస్సం కోటపై బ్రిటీషువారి తొలి దాడి
తహసీల్దార్‌ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపిన విషయం తెలుసుకున్న నాటి కడప కలెక్టర్‌ కాక్రేన్‌ ఆగ్ర హోదగ్రుడయ్యాడు. వెంటనే సైన్యాన్ని తీసుకొని నొస్సం కోటపై దాడి చేయాలని బళ్లారిలోని బ్రిటీషు బ్రిగేడియర్‌ జనరల్‌ వాట్సన్‌ను ఆదేశించాడు. అప్పటికే స్థానికులకు తోడు అవుకు రాజు నారాయణరాజు పరివారం, ఆయుధ సామగ్రిని సిద్ధం చేసుకున్నాడు నరసింహారెడ్డి. కోట చుట్టూ కందకాలు తవ్వించాడు. శుత్రుసైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ పొలాలను తడిపించాడు. కోటను ఎక్కడానికి ప్రయత్నించేవారిపై సలసల కాగే నూనెను కుమ్మరించే ఏర్పాట్లు చేశాడు. మేలురకం శతఘ్నులు సిద్ధం చేసుకున్నాడు. 1846 జూలై 23న బ్రిటీషు సైన్యం నొస్సం కోటపై దాడికి వచ్చింది. గుండె లు జలధరింపజేసే పోరాటం.. బ్రిటీష్‌ సైన్యం చావుకేకల తో భీతావహ వాతావరణం ఏర్పడింది. నరసింహారెడ్డి తెలివితేటల ముందు బ్రిటీష్‌ సైన్యం మట్టికరిచింది. ప్రాణభయంతో పారిపోతున్న వాట్సన్‌ తలను ఒక్కవేటు తో నరికేశాడు నరసింహారెడ్డి.

అడుగడుగునా యుద్ధ తంత్రాలు
నరసింహారెడ్డికి అనుక్షణం అండగా నిలిచిన గురువు గోసాయి వెంకన్న. ఆయన మాటే రెడ్డికి వేదవాక్యం. బ్రిటీషువారిపై సాధించిన విజయాన్ని చూసి పొంగిపో కూడదని, బ్రిటీషు సైన్యం అత్యంత పెద్దదైనందున రక్షణ కోసం మకాం మార్చాలని సూచించాడు. దీంతో వనవిహా రం నిమిత్తం నల్లమల అడవుల్లో కట్టించిన వన దుర్గంలో కి నరసింహారెడ్డి తన అనుచరులతో మకాం మార్చారు. అక్కడి సమీపంలోని రుద్రవరం గ్రామంలో ప్రజలు వంట చెరకు, పశువులకు గడ్డికి అడవిపైనే ఆధారపడ్డారు. పీటర్‌ అనే ఫారెస్ట్‌ అధికారి ప్రజల నుంచి బలవంతంగా రుసుం వసూలు చేసేవాడు. ఆడవాళ్లు అడవిలోకి వెళితే బలా త్కారం చేసి చంపేసేవాడు. ఆ ఊరిలోని రైతు నాయకు డు జంగం మల్లయ్య ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి పీటర్‌ను వెంటాడి వేటాడి చంపాడు. దీంతో రుద్రవరంతో పాటు, కంభం చుట్టు పక్కల గ్రామాలన్నీ పండుగ చేసుకున్నా యి. నరసింహారెడ్డిపై పల్లె పదాలు, కోలాటపు గేయాలు పుట్టుకొచ్చాయి. బ్రిటీషు అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది.

నరసింహారెడ్డి తలపై రూ.10 వేల బహుమతి
కర్నూలులో తుంగభద్ర తీరం వద్ద ఉన్న బ్రిటీషు ప్రభుత్వ తాలుకా కార్యాలయంలో కడప కలెక్టర్‌ కాక్రేన్‌ అధ్యక్షతన వాట్సన్‌ స్థానంలో నియమితుడైన కెప్టెన్‌ నార్టన్‌, కర్నూలు కెప్టెన్‌ రసెల్‌, మిలిటరీ కమాండింగ్‌ ఆఫీసర్‌ జోసఫ్‌, గవర్నర్‌ ఏజెంట్‌ డానియెల్‌ సమావేశ మయ్యారు. నరసింహారెడ్డిని ఒక్కడిని చేసి పట్టుకోవాల ని, అతని తలపై రూ.10 వేలు బహుమతి ప్రకటించి ప్రజల్ని ప్రలోభపర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించు కున్నారు. ఆ మర్నాడే బ్రిటీష్‌ అధికారులు ఒక ప్రకటన చేశారు. ‘రాజద్రోహి నరసింహారెడ్డి స్థావరం, ఆచూకి తెలిపిన వారికి రూ.5 వేలు బహుమానం, అతన్ని సజీ వంగా లేదా నిర్జీవంగా పట్టి తెచ్చినవారికి రూ.10 వేలు బహుమానం కలెక్టర్‌ కాక్రెన్‌ దొరవారు ఇస్తారు. వీరులై న వారు నరసింహారెడ్డిని పట్టిచ్చి బహుమానం అందు కోండహో’’.. అంటూ తప్పెటతో చాటింపు వేయించారు.
నొస్సం కోటను కూల్చిన బ్రిటీష్‌ ప్రభుత్వం
ప్రజల్లో భయాన్ని కలిగించి నరసింహారెడ్డిని మట్టు బెట్టవచ్చనే ఉద్దేశంతో కెప్టెన్‌ నార్టన్‌ నొస్పం కోటను ఫిరంగులతో కూల్చేశాడు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న నరసింహారెడ్డి కంటతడి పెట్టాడు. రాయికి రాయి చేర్చి నిర్మించిన నొస్సం కోటను కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లు భావించాడు. ఇదే సంద ర్భంలో ఎట్టి విషమ పరిస్థితుల్లోనూ తమ స్థావరం ఆచూకీ తెలియజేయకూడదని గోసాయి వెంకన్న ప్రతిజ్ఞ చేయించాడు. నరసింహారెడ్డిని బ్రిటీషు అధికారులకు పట్టించాలని రుద్రవరం తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి పన్నాగం పన్నాడు. సమీపంలోని దువ్వూరు గ్రామపెద్ద రోశిరెడ్డితో ఎల్లమ్మ జాతరకు సన్నాహాలు చేయించాడు. రోశిరెడ్డి నరసింహారెడ్డికి స్నేహితుడే కావడం వల్ల ఆయ నను కోడిపందేలకు ఆహ్వానించాలని కోరాడు. ఈ ఆహ్వా నాన్ని మన్నించి జాతరకు విచ్చేసిన నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని యత్నించగా నరసింహారెడ్డి తెలివిగా తప్పించుకున్నాడు.
సాటి పాలెగాళ్ల మద్దతు
అవుకు నారాయణరాజుతో పాటు మార్కాపురం జాగిర్దారు, వెంకట క్రిష్ణయ్య, అనంతపురం జమిందారు పడకంటి వీరస్వామి, చిత్తూరు జాగిర్దార్‌ శివస్వామి చౌదరి, కర్నూలు నవాబు పాపాఖాన్‌ తదితరుల మద్ద తు సమకూర్చుకున్నాడు నరసింహారెడ్డి. బ్రిటీష్‌ పాలకు లపై తిరుగుబాటు మరింత ఉధృతం చేసేందుకు సహకారం కావాలని కోరారు.
ఆచూకి చెప్పింది బంధువే..
ఉయ్యాలవాడ జాగీర్దార్‌ పెద్దమల్లారెడ్డి కుటుంబాని కి నెలకు రూ.70 భరణం బ్రిటీషు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో సగం సోదరుడు చిన్న మల్లారెడ్డికి పోయేది. పెద్ద మల్లారెడ్డి ముగ్గురు కుమారుల్లో చివరి వాడు నరసింహారెడ్డి. ప్రజల్లో తన తమ్ముడికి ఉన్న ఆదరాభిమానాలు చూసి ఈర్ష్య పెంచుకున్నాడు మల్లా రెడ్డి. తమ్ముడిపై కక్ష సాధించేందుకు వీక్షిస్తుండగా కడప కలెక్టర్‌ కాక్రేన్‌ నుంచి అతనికి వర్తమానం అందింది. కాక్రేన్‌ పథకం పలించింది. కోటలో పాగా పడింది. అత ను అందించిన ఉప్పు మేరకే నరసింహారెడ్డిని పట్టుకో వడానికి మార్గం సులువైంది. నరసింహారెడ్డి భార్యా పిల్లల్ని బందించి కడప పట్టణంలోని లాల్‌ బంగ్లాలో పెట్టాడు. తన అనుమతిలేనిదే లోనికి ఎవ్వరినీ వెళ్లనీయ వద్దని బంగ్లా అధికారులను ఆదేశించారు. నరసింహారెడ్డి కి సాయం చేయకుండా కడప నవాబు మహమ్మద్‌ ఇబ్ర హీం, కర్నూలు నవాబును బంది చేశాడు. నరసింహారెడ్డి తన భార్య దొరసాని సుబ్బమ్మ, కొడుకు దొర సుబ్బయ్య ను విడిపించుకు నేందుకు వస్తాడని కాక్రెన్‌ ఎత్తుగడ వేశాడు. అయితే ఓ అర్ధరాత్రి బంగ్లా అధికారి గుండెలపై కత్తి పెట్టి నరసింహారెడ్డి తన భార్య, బిడ్డలను ధైర్యంగా తీసుకెళ్తున్న దృశ్యాన్ని నివ్వెరపోయి చూడడం కాక్రేన్‌ వంతైంది.
ప్రజలపై హింస..
నరసింహారెడ్డిని ధైర్యంగా ఎదుర్కోవడం, యుద్ధ విద్యలతో పట్టుకోవడం సాధ్యం కాదని బ్రిటీష్‌ అధికారు లకు అర్థమైంది. ఏ ప్రజల కోసమైతే జీవిస్తున్నాడో వారిని హింసించడం ద్వారా నరసింహారెడ్డిని లొంగదీసు కోవచ్చని పన్నాగం పన్నారు. రెడ్డి ని ఆరాధించే 60 గ్రామాలపై సైనికుల దాడి జరిగింది. పిల్లాజెల్లా.., గొడ్డూ గోదా.. ఎవరినీ వదల్లేదు. అనుమా నం ఉన్న ప్రతివారిని పటు ్టకుని ‘నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పు’ అంటూ హింసించారు. కండకుష్టి గల యువకులను బంధీలుగా పట్టుకెళ్లారు. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ రాక్షస చర్య అంతా నర సింహారెడ్డి సోదరుడు మల్లారెడ్డి సలహా మేరకే జరిగిం ది. ఇవన్నీ తెలుసుకున్న నరసింహా రెడ్డి ప్రజలకోసం స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు.
అంతిమ పోరాటం..
1856 అక్టోబర్‌ 6 చరిత్రలో మరపురాని ఘట్టం లిఖితమైంది. నరసింహారెడ్డి ఆచూకిని కనుగొన్న బ్రిటీష్‌ సైన్యం అతన్ని బంధించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. నరసింహారెడ్డి, ఆయన అనుచరులు ఉంటున్న గుట్టను చుట్టుముట్టింది. కలెక్టర్‌ కాక్రేన్‌ నరసింహారెడ్డి లొంగిపోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేశాడు. నార్టన్‌ సైన్యం కొండపైకెక్కడానికి ప్రయత్నించగా నరసింహా రెడ్డి సైన్యం ఎదురొడ్డింది. ఈ తరుణంలో నార్టన్‌ నరసింహారెడ్డి తుటాకు బలయ్యాడు. నరసింహారెడ్డి సైన్యం తక్కువగా ఉండటం, కుంఫిణీ సేన ఎక్కువగా ఉండటంతో పరిస్థితి చేజారింది. బ్రిటీష్‌వారు క్షణక్షణం సైన్యాన్ని పెంచుకుంటూ పోవడంతో వారిని నిలువరించడానికి నరసింహారెడ్డికి చాలా సమయం పట్టింది. వెంట తెచ్చుకున్న తూటాలన్నీ అయిపోగా చివరికి కత్తి పట్టి సైనికు ల మధ్య చొరబడి సింహనాదం చేశాడు. బ్రిటీష్‌ సైనికులు నరసింహారెడ్డిని బాగా గాయపరిచారు. దెబ్బతిన్న పులిని చివరకు సైన్యం పట్టుకుంది.
కోవెలకుంట్ల కోట గుమ్మానికి నరసింహారెడ్డి తల
నరసింహారెడ్డిని విచారించిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది. జుర్రెటి ఒడ్డున ఉరి తీస్తున్నట్లు చాటింపు వేయించింది. రాయలసీమ వాసు లంతా తమ దొరను చివరిసారిగా చూసుకొనేందు కు కోయిలకుంట్లకు ప్రయాణం కట్టారు. ప్రతి పల్లె నుంచి జనం తరలివచ్చారు. 1847 ఫిబ్రవరి 22 తెల్లవారుజామున కచేరి జైలు ద్వారం తెరుచుకుంది. కుంఫిణీ సైనికుల వెంట ఒక్కో అడుగు వేస్తూ బయటకు వచ్చిన తమ పాలెగాడు నరసింహారెడ్డిని చూడగానే జనసంద్రం పొంగిపొర్లింది. దొర నరసింహారెడ్డికి జై అంటూ నినాదాలు హోరెత్తాయి. నరసింహారెడ్డి కళ్లు చెమ్మగిల్లాయి. తన ఉద్యమం ఇంత టితో మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది అని జనానికి అభివాదం చేస్తూ జుర్రెటి ఒడ్డుకు సాగిపోయాడు. ఒడ్డుకు పదడుగుల దూరానా నిలువెత్తు పాతిన ఉరికొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మరణయాత్ర సాగించాడు. తిరుగుబాటుదార్లకు హెచ్చరికగా నరసింహా రెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుపసంకెళ్ల మధ్య వేలాడదీశాడు బ్రిటీష్‌ వారు. 1877 వరకు మూడు దశాబ్దాల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడుతూ ఉండిపోయింది

Thursday 6 July 2017


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
Uyyalavada narasimha reddy.jpg
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
జననంఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కర్నూలు జిల్లాలోని రూపనగుడి
మరణంఫిబ్రవరి 221847
మరణ కారణముఉరిశిక్ష
ఇతర పేర్లుఉయ్యాలవాడ నరసింహారెడ్డి
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు
భార్య / భర్తముగ్గురు భార్యలు. పెద్దభార్య సిద్దమ్మ
పిల్లలుదొర సుబ్బయ్య
తండ్రిపెదమల్లారెడ్డి
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలోరాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు.

ప్రారంభ చరిత్ర

18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు.నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.
ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.
నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడపకర్నూలుఅనంతపురంబళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరుగుళ్లదుర్తికొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.
నరసింహారెడ్డి తల్లి ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య వలన ఒక కూతురు, మూడవ భార్య వలన ఇద్దరు కుమారులు జన్మించారు.

తిరుగుబాటు ప్రారంభం


నరసింహారెడ్డి సేన వాడిన ఫిరంగి - కొత్తకోట (గిద్దలూరు) గ్రామం వద్ద ఉన్నది

నరసింహారెడ్డి సేన తమ ఫిరంగిలో వాడిన ఇనుప గుండు
1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్లఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తిమునగాలజటప్రోలుపెనుగొండఅవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.
1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు.ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.
తరువాత జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది.

వీరమరణం

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.[1]
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

Monday 20 March 2017

ABOUT UYYALAWADA NARASIMHAREDDY

Uyyalawada Narasimha Reddy (died 1847) is credited to be one of the first freedom fighters in India. His was the first revolt in India against the British occupation, 10 years earlier than India's First War of Independence (term) of 1857 also known as Indian Rebellion of 1857. Nearly 60 villages were under the control of Reddy, including Uyyalawada, Gulladurti, Harivaram,narsipalle,pampalle, Uppaluru,koilakuntla, Kotthakota. The ruins of the fort at Kotthakota can still be seen. Now these villages are in Prakasam,Kurnool,Kadapa (or Cuddapah), Anantapur districts of Andhra Pradesh and in the Ballari region of Karnataka. Renati simham a telugu novel by Dr.P.DamodaraReddy

Early life

Uyyalawada Narasimha Reddy was born to Uyyalawada Peddamalla Reddy in Uyyalawada, located in the present-day Kurnool District which is on the banks of Kundu River. His father Peddamalla Reddy and his grandfather Jayarami Reddy were local chieftains (Polygars) of Koilakuntla.
He built a fort at Kottakota village near Giddalur. The ruins of the fort can still be seen at Kottakota.

Background and uprising

Narasimha Reddy, as a polygar of Koilakuntla was in command of 66 villages in Cuddapah (or Kadapa), Anantapur, Bellary and Kurnool districts and controlled an army of 2000. After Rayalaseema was ceded to the British by the Nizam, Narasimha Reddy refused to share the revenue of the region with the British. He was in favour of an armed uprising. On 10 June 1846 he attacked the treasury at Koilakuntla and marched towards KambhamAndhra Pradesh (Prakasam District). On the way, he created uproar at Rudravaram by killing the forest ranger. The district collector, Thomas Monroe, took a serious view of the rebellion and ordered his capture. Early attempts to capture him under Captain Knot and Watson were unsuccessful. The British government announced Rs 5,000/ for the information and Rs 10,000/ for his head which was a huge amount in those days.

Capture and death

Narasimha Reddy with his army attacked the British forces camped at Giddaluru on 23 July 1846 and defeated them. Unable to capture him, the British imprisoned his family at Kadapa. In an attempt to free his family, Narasimha Reddy moved to Nallamala forest. Someone in the village informed this to the Collector of koilakuntla. When the British tightened his movements in the Nallamala region, Narasimha Reddy came back to Koilkuntla area and hid in Jagannatha Konda near the village of Ramabhadrunipalle. An informant brought to the notice of British authorities of his whereabouts and his followers. The area was surrounded by armed forces at night. He was caught at midnight of 6 October 1846. Narasimha Reddy was humiliated before being brought to Koilkuntla. He was tied with heavy chains and paraded in the streets of Koilkuntla with blood-stained clothes so that none should dare to revolt against the British.
As many as 901 people were charged along with Narasimha Reddy for this uprising. Later 412 of them were acquitted and 273 were released on bail. As many as 112 were convicted and sentenced to imprisonment for 5 to 14 years. Some were sent to a prison in the Andaman Islands. The younger brother of the rulers of Auk is one of them. The special commissioner of Cuddapah conducted the trial. Narasimha Reddy was charged with revolt, murder and dacoity and convicted on all charges. He was sentenced to death by hanging. On 22 February 1847, Reddy was hanged publicly by the British in Koilkuntla on the banks of a nearby river in the presence of collector Kokcrane.
In order to terrorize the other freedom-fighters, his head was kept hanging to the fort of Koilakuntla for about 30 years after his death (that is from 1847 to 1877)

Monuments

Forts built by Narasimha Reddy still exist at places like Nossam,Uyyalawada, Rupanagudi,kristipadu, Uppaluru and Giddaluru. His story is alive in Rayalaseema particularly Kurnool and Kadapa districts

Memorial committee

A committee was formed to develop Jagannatha Konda as a memorial monument of Uyyalawada Narasimha Reddy. The committee consists of eminent political personalities. Silpa Chakrapani Reddy is honorary president to the committee. Kaipa Prathap Reddy, Kasipuram Prabhakara Reddy, Gangula Janardhan Reddy, Palukuru Gopal Reddy and many local leaders were founding members. There are plans to erect a statue of Narasimha Reddy and to publish the historical importance of the site.

Memorial Committee for The Sun and Moon of Renadu

A committee (Renati Surya Chandrula Smaraka Samithi) was formed to preserve the memory of two great leaders of that time (Uyyalawada Narasimha Reddy and the Philanthropist Budda Vengal Reddy, both were born in Uyyalawada village). Sri Pocha Brahmananda Reddy is the founding president of this committee.
A book (both in Telugu and English languages) titled "Renati Surya Chandrulu (The Sun and Moon of Renadu) was published by this committee in 2015 (5th Edition of Telugu version was published on 22-Feb-2016). It contains the excerpts from research papers by eminent historians and from the archives of "East India Company" during 1846–1847.
Sri Pocha Brahmananda Reddy interacted with Sri Narendra Modi, Prime Minister of India, personally presented these books and other details to Sri Narendra Modi and Sri Venkaiah Naidu, Minister for Urban Development, when they visited Tirupati and requested them to include the life story of Narasimha Reddy in the textbooks for school children. Results of these efforts, the biography of Narasimha Reddy was included in the textbook for 6th class students in Andhra Pradesh.